210 రూపాయలు కడితే చాలు.. మీరు నెలకు 5000 పెన్షన్ పొందొచ్చు!

మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు బాగా ఉన్న వ్యక్తి రేపటికి ఎలా ఉంటాడో చెప్పలేం. అందుకే మనిషి జీవితానికి భరోసా కావాలి. ఫ్యామిలీకి భరోసా కావాలి. భరోసా లేకపోతే మనిషికి చాలా కష్టం. మరి జీవితంలో భరోసా కావాలి అంటే ఏం చేయాలి. జీవిత భీమా చేయించుకోవాలి.చాలా కంపెనీలు భీమా సౌకర్యాన్ని కలిపిస్తున్న వాటి ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. నెలకు కనీసం వేయి నుంచి భీమా మొదలౌతుంది. డబ్బులు దండిగా ఉన్న వ్యక్తులు భీమాను కట్టుకుంటారు. పేదవారి పరిస్తితి ఏమిటి.. వారికెలా.. దీని గురించి ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఓ పేదవారికి భరోసా ఇవ్వడానికి ఓ పథకాన్నితీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన సింపుల్ గా దీనిని పీఏంఏవై అంటారు.

దీనిని 18 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల వరకు అర్హులు. మీకు 18 సంవత్సరాల వయసు ఉంటే.. మీరు నెలకు కేవలం 42 రూపాయల కడితే సరిపోతుంది. ఈ 42 రూపాయలను మీరు 42 సంవత్సరాల పాటు కట్టాలి. ఇలా కడితే.. మీకు 60 ఏళ్ళు వచ్చాక నెలకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది.

ఇక ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి.. మీకు నెలకు రెండువేల రూపాయల పెన్షన్ కావాలి అనుకుంటే 84 రూపాయలు చెల్లించాలి. మీకు నెలకు 5 వేల రూపాయల పెన్షన్ కావాలి అనుకుంటే నెలకు 210 రూపాయలు 42 సంవత్సరాల పాటు చెల్లించాలి. ఇలా చెల్లిస్తే మీకు 60 సంవత్సరాల వయసు తరువాత నెలకు 5 వేల రూపాయల చొప్పున పెన్షన్ అందుకుంటాం.

అదే మీకు ఇప్పుడు 40 సంవత్సరాల వయసు ఉంది అనుకుంటే మీకు నెలకు 5 వేల రూపాయల పెన్షన్ కావాలి అనుకుంటే మీరు నెలకు 1454 రూపాయల చొప్పున 20 సంవత్సరాల పాటు చెల్లించాలి. మీకు 60 సంవత్సరాల తరువాత నెలకు 5 వేల రూపాయల చొప్పున పెన్షన్ పొందుతారు. మీరు ఎన్ని సంవత్సరాల వయసు అనే దానిని బట్టి మీరు నెలకు కట్టుకోవచ్చు.ఇకపోతే, ఈ పిఏంఏవై కడుతున్న సమయంలో మధ్యలో ఏదైనా జరిగి మీరు మరణిస్తే.. మీరు భీమా చెల్లించవలసిన అవసరం లేదు. మీరు వేయి రూపాయల పెన్షన్ ప్లాన్ కు కడుతూ మరణిస్తే.. మీ కుటుంబానిని 1,70,000 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే మీరు 5 వేల రూపాయల పెన్షన్ ప్లాన్ కడుతూ మరణిస్తే.. మీ కుటుంబానికి 8,50,000 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే డౌట్ ఉండొచ్చు. మీకు ఏ బ్యాంక్ లో ఖాతా ఉంటుందో ఆ బ్యాంక్ ద్వారా మీరు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. దీనికి సంబందించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కూడా చాలా ఈజీ. సొ, మీరు తప్పకుండా ఈ పథకాన్ని వినియోగించుకొని మీ కుటుంబానికి భరోసా ఇవ్వండి.

More from my site

Leave a Reply

*