సుకన్య సమృద్ధి యోజన పథకం….ఇలా చేస్తే ప్రతి ఆడపిల్ల లక్షాధికారి అవుతుంది.

భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా తపాల శాఖ ద్వారా ప్రవేశపెట్టింది. 2015 ఫిబ్రవరి నెలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిపై తపాల శాఖ కూ డా విశేషంగా కృషి చేసింది. విశాఖలో చాలా ఎక్కువగా ప్రచారం కల్పించారు. గత ఏడాది విశాఖనగరంలోనే దాదాపుగా 18 ఖాతాలను తెరిచారు. ఈ ఏడాది మరో 12 వేల వరకూ ఖాతాలను తెరిచారు. ఇప్పటికి ఒక్క నగర పరిధిలోనే 30 వేల ఖాతాలు ఉన్నాయి. ఇక విశాఖ రూరల్‌ జిల్లాలో కూడా మరో 15 వేల ఖాతాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో.. తపాల శాఖ ద్వారా ముందుగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టినా, తరువాత భారతప్రభుత్వం ఈ పథకాన్ని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా విస్తరించింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 2015 మే 16న ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ విశాఖ జోన్‌ పరిధిలోని శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జోన్‌ పరిధిలోని బ్యాంకులలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 3 వేల 650 ఖాతాలను తెరిచారు. వీటి ద్వారా రూ.5.70 కోట్లను సేకరించారు.

వడ్డీ వివరాలను పరిశీలిస్తే..  వడ్డీ విషయం పరిశీలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 9.1 శాతం వడ్డీని అందిస్తారు. 2015-16 సంవత్సరానికి 9.2శాతం వడ్డీ అందించేలా పెంపు చేశారు. పొదుపుపై వడ్డీ ఉదాహరణకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున 14 సంవత్సరాలు పొదుపుచేస్తే 21 సంవత్సరాల తరువాత 6 లక్షల 7 వేల 128 రూపాయలు అందిస్తారు. నెలకు 2500 రూపాయలు చొప్పున 14సంవత్సరాలు పొదుపుచేస్తే 21 సంవత్సరాల తరువాత 15 లక్షల 17 వేల 820 రూపాయలు ఇస్తారు. నెలకు 5 వేల రూపాయల చొప్పున 14సంవత్సరాలు పొదుపుచేస్తే 30 లక్షల 35 వేల 640 రూపాయలు అందిస్తారు. నెలకు 7500 రూపాయలు చొప్పున 14 సంవత్సరాలు పొదుపుచేస్తే 21సంవత్సరాల తరువాత 45 లక్షల 53 వేల 460 రూపాయలు వస్తుంది. నెలకు 10 వేల రూపాయలు చొప్పున 14 సంవత్సరాలు కడితే 21 సంవత్సరాల తరువాత 60 లక్షల 71 వేల 280 రూపాయలు అందుకోవచ్చు. నెలకు 12,500 రూపాయలు చొప్పున 14 సంవత్సరాలు కడితే 21 సంవత్సరాల తరువాత 75 లక్షల 89 వేల 103 రూపాయలు పొందవచ్చు.దేశంలోని ఏ పోస్టాఫీస్‌లోనైనా, లేదా ఏ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లోనైనా ఈ ఖాతా ను తెరుచుకోవచ్చు. పోస్టాఫీసులో ఖాతా తెరిచేందుకు పిల్లల జనన ధ్రువపత్రాలతోపాటు, తల్లిదండ్రుల లేదా సంరక్షకులకు చెందిన ధ్రువపత్రాలు స మర్పించాలి. కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలున్నా వారిద్దరికీ ఈ ఖాతాను ప్రారంభించే అవకాశముంది. ఒక అమ్మాయి పేరిట ఒక ఖాతా తెరవాలి. ఖా తా కనీస మొత్తం వెయ్యి రూపాయలుండాలి. తరువాత నిర్వహణలో కట్టే మొత్తం రూ.100 నుంచి ఎంతైనా కట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లు లక్షా యాభై వేల రూపాయలు మించరాదు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తరువాత చదువు నిమిత్తం డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉం ది. ఖాతాను కనీసం 14 సంవత్సరాలు, అత్యధికంగా 21 సంవత్సరాలు నిర్వహించుకోవచ్చు.

అర్హులు వీరు :ఆడ పిల్లల తల్లిదండ్రులు ఈ ఖాతాలను ప్రా రంభించడానికి అర్హులు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి 10 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లల త ల్లిదండ్రులు ఈ పథకం ద్వారా ఖాతా ఆరంభించవచ్చు. 2003 డిసెంబర్‌ 3 నుంచి 2015 డిసెంబర్‌ 1 వరకూ పుట్టిన ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు.బ్యాంక్ కు సమర్పించవలసిన పత్రాలు: * పాప జనన దృవీకరణ పత్రం * రెండు పాస్ పోర్టు పోటోలు * తల్లితండ్రుల చిరునామా మరియు ఐడీ ప్రూఫ్.

More from my site

Leave a Reply

*