పాపం చిట్టి తల్లిని గర్భిణిని చేసిన….కీచక టీచర్…ఇలాంటి వాణ్ణి ఏమి చేయాలి ?

బిధుభూషణ్‌ నాయక్‌  అనే స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలోని  ఓ విద్యార్థినిని తానే  గర్భిణిని చేశాను అని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు.  అసలు విషయం వివరాల్లోకి వెళ్ళితే…. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితిలోని ఓ గ్రామంలో ఈ సంఘటన  జరిగింది . ఇదే సమితికి చెందిన ఓ బాలిక బల్దాలోని బాలికల వసతిగృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాలకు దసరా సెలవులు కావడంతో విద్యార్థినులంతా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. బాధిత బాలిక ఇంటిక వెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆదివారం వసతిగృహానికి నేరుగా వచ్చారు.

అనంతరం పాఠశాల  ప్రధానోపాధ్యాయుడ్ని  అడగగా తాను  ఇంటికి వెళ్లిపోయిందని ఆయన బుకాయించాడు. తల్లిదండ్రులు కుమార్తె స్నేహితులను కలిసి అడగగా ఆమె వసతిగృహంలోనే ఉందని చెప్పడంతో వారు పోలీసు స్టేషన్ కి వెళ్లి  ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధానోపాధ్యాయుడ్ని విచారించగా విద్యార్థినిని తానే బంధించి ఉంచానని అంగీకరించాడు. బాధిత బాలికను విడిపించి విచారించగా ప్రధానోపాధ్యాయుడు కొన్నాళ్లుగా తనను లొంగదీసుకొని గర్భిణిని చేశాడని, ఇంటికి వెళ్తే తల్లిదండ్రులకు విషయం చెబుతానని గదిలో బంధించాడని వివరించింది. పాఠశాల  ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పొలిసు  అధికారులు వివరించారు.

More from my site

Leave a Reply

*