హిజ్రాలు..కలసి ఓ యువ‌కుడిని ప‌ట్టుకుని ఉతికేసారు … కార‌ణం తెలిస్తే షాక్‌!

హిజ్రాల ప‌ని బాగుంద‌నుకుంటూ ఓ యువ‌కుడు తానూ వారిలా`గే` త‌యార‌య్యాడు. హిజ్రాల్లాగే వేషం మార్చుకుని రోడ్డు మీద, ట్రాఫిక్ సిగ్న‌ళ్ల వ‌ద్ద భిచ్చ‌మెత్త‌టం మొద‌లు పెట్టాడు. వారం రోజుల నుంచీ సాగుతోందా యువ‌కుడి వ్య‌వ‌హారం. రోడ్డుపై కొత్త ముఖం క‌నిపించే స‌రికి అస‌లు హిజ్రాల‌కు అనుమానం వ‌చ్చింది. అత‌గాణ్ణి ప‌ట్టుకుని నిల‌దీశారు. దీనితో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఆ యువ‌కుడు హిజ్రాల వేషం వేసుకుని త‌మ పొట్ట కొడుతున్నాడ‌నే ఆవేశంతో.. న‌డిరోడ్డు మీద ఉతికేశార‌త‌ణ్ణి. అనంతరం పోలీసుల‌కు అప్ప‌గించారు. క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరెలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. ఆ యువ‌కుడి పేరు రాజ‌శేఖ‌ర్‌. బిచ్చ‌మెత్తుకోవ‌డం వ‌ల్ల హిజ్రాల‌కు మంచి ఆదాయం వ‌స్తోంద‌ని గ్ర‌హించిన అత‌ను వారిలాగే త‌యార‌య్యాడు. త‌న పేరును కావ్య‌గా మార్చుకున్నాడు. దావ‌ణగెరె ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన మార్గాల్లో బిచ్చ‌మెత్తుకోవ‌డం ప్రారంభించాడు. వారంరోజుల వ్య‌వ‌ధిలో బాగానే డ‌బ్బులు పోగ‌య్యాయి.

సోమ‌వారం ఉద‌యం దావ‌ణ‌గెరెలోని గ‌డియారం స్తంభం కూడ‌లిలో బిచ్చ‌మెత్తుకోవ‌డానికి వ‌చ్చాడు. అక్క‌డే అసలు హిజ్రాల‌కు దొరికిపోయాడు. కొత్త‌గా ఈ హిజ్రా ఎవ‌రంటూ అస‌లు హిజ్రాలు అత‌ణ్ణి నిల‌దీశారు. అస‌లు హిజ్రాల హావ‌భావాలు, మాట తీరు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. రాజ‌శేఖ‌ర్ ఇక్క‌డే వారికి దొరికిపోయాడు. గ‌ట్టిగా నిల‌దీసే స‌రికి తాను హిజ్రా కాద‌నే విష‌యాన్ని అంగీక‌రించాడు. దీనితో అస‌లు హిజ్రాలు అత‌ని ప‌ని ప‌ట్టారు. బ‌ట్ట‌లు విప్పించి కొట్టారు. ఆటోలో తీసుకెళ్లి దావ‌ణ‌గెరె పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించారు.

 

More from my site

Leave a Reply

*