మార్వాడీ ల మీరు కోటీశ్వరులు అవ్వాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా

మార్వాడీలలా మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ఎమ్ చెయ్యాలి.?అయితే మీరు ఇలా చేస్తే ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం. ఇది జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:మీ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులకు కారణం మీకు శని గ్రహ చేత పేదించపడడమే. మీకు లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోవడమే. వీటన్నిటిని తొలగించుకోవాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం,శని అనుగ్రహం పొందాల్సిందే. శుక్రవారం నాడు శని కి అత్యంత ప్రీతి కరమైన ఈనుమతో చేసిన బాగా అరిగిపోయిన గుర్రపు నాడాని తెచ్చుకొని పసుపు కుంకుములు పెట్టి లక్ష్మీ దేవి ఫోటో దెగ్గర పెట్టాలి. దానికి పూజ చేసి దుప దీప నైవేద్యములు సమర్పించాలి. తరువాత ఆ గుర్రపు నాడాను తెచ్చి ఇంటి సింహపు ద్వారానికి U ఆకారంలో గోడకు దిగ్గొట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి పరుగున వచ్చి తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది. గుర్రపు నాడా అంటే లక్ష్మీ దేవి కి చాలా ఇష్టం. ప్రతి రోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవాలి. ఇలా మార్వాడీలు ఎక్కువగా చేస్తుంటారు. అందుకే మనం చూస్తూ ఉండగానే వాళ్ళు బాగా ధనవంతులు అవుతున్నారు.మీరు కూడా సొంత ఇంట్లో ఉన్న అద్దె ఇంట్లో ఉన్న ఈ గుర్రపు నాడా ను మీ గోడకు కొట్టండి. వెంటనే మీరు ఐశ్వర్యవంతులు అవుతురు.

అదే గుర్రపు నాడాను ఇంకొల చెయ్యొచ్చు. ఆ నాడాని తీసుకొచ్చి కడిగి లక్ష్మీ దేవి దెగ్గర పూజ చేసి కొలిమికి తీసుకెళ్లి సన్నని తీగల చుట్టవేసి దాన్ని కంకణంగా కానీ ఉంగరంగా చేయించుకోవాలి. పురుషులు అయితే రెండు చేతులకు. మధ్య ఒక వేలుకు ఉంగరాలు ధరించాలి. అదే స్త్రీ అయితే చేతికి ఏదో ఒక వేలుకి ధరించవచ్చు. ఈ ఉంగరం కానీ,కంకణం కానీ ధరిస్తే వారికి ఎటువంటి అప్పుల బాధలు ఉండవు. బంగారాన్ని తాకట్టు పెట్టుకునే పని ఉండదు. వారి ఇంట బంగారం స్థిరపడి ఉంటుంది అని తంత్ర శాస్త్రాలు చెప్తున్నాయి. కొంతమంది పండితులు దీన్ని చే పట్టి మంచి ఫలితాలు పొందరు. మార్వాడీలు ముందు వాళ్ళ పిల్లలకు ఈ ఉంగరాన్ని ధరించాకే బంగారాన్ని ధరిస్తారు. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు షిర్డీ సాయిబాబా ను ఇష్టంగా పూజించడమే. వారు కృష్ణుడిని, లక్ష్మీ దేవి ని ఎంత ఇష్టంగా పూజిస్తారో అంతకంటే ఇష్టంగా సాయిబాబా ను పూజిస్తారు. వారిలో కొంతమంది నైవేద్యంగా చపాతీలు పెడతారు. ఆ చపాతీలను అందరికి ప్రసాదంగా పంచి పెడతారు. ఇంకా వారు గోవులకు పెడతారు. మార్వాడీలు ఎక్కడ నివసిస్తున్న ఇవి చెయ్యక మానరు. అందుకే వాళ్ళు అంత ధనవంతులగా మారుతున్నారు. కాబట్టి మీరు ఇలానే చెయ్యండి. ఐశ్వర్యవంతులు అవ్వండి.

More from my site

Leave a Reply

*