భార్యను- అద్దెకి-ఇవ్వటం, స్త్రీలు నిజంగా లీజుకిస్తూ ఒప్పొధం చేసుకొనే ప్రదేశం ఇదే

దేశంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటం వలన జరిగే పరిణామాలు.. “స్త్రీలు అంగీకరించకూడదు;వారు పోరాడాలి. తన చుట్టూ నిర్మించిన గోడలను చూసి ఆశ్చర్యంలోనే మిగిలిపోకూడదు;ఆమెలో వ్యక్తీకరణకి తపిస్తున్న స్త్రీకి చేయూతనివ్వాలి.” గర్భాశయాన్ని అద్దెకిచ్చే మొదటిదశనుంచి ఇప్పుడు భారతీయ స్త్రీలు భార్యలను అద్దెకిచ్చే దశకి వచ్చారు! అవును, మీరు సరిగ్గానే చదివారు,

భార్యను- అద్దెకి-ఇవ్వటం. పెళ్ళిలో అమ్ముడుపోవటం నుంచి, ఇప్పుడు భార్యలు దొరకని పెద్దింటి మగవారికి భార్యలుగా ఉండటాన్ని కోరబడతున్నారు, అదీ నెలలవారీ లేదా సంవత్సరాలవారీగా. స్త్రీల సాధికారత, మరియు సమానహక్కుల కోసం పోరాడుతున్న దేశంలో, స్త్రీలు నిజంగా లీజుకిస్తూ అమ్మబడుతున్నారు.ఇలాంటి అలవాట్లు మన సంస్కృతిలో అనేక సంవత్సరాలనుండి ఉన్నాయి. కానీ వాటికి వ్యతిరేకంగా ఈ నాటివరకు ఏ చర్య తీసుకోకపోవడం బాధాకరం. మీకు ఇలాంటి కొన్ని కేసులు వివరిస్తాను.

ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల తర్వాత కూడా స్త్రీ శిశుభ్రూణహత్యలు ఇంకా ఆగలేదు. అందుకే మధ్యప్రదేశ్ లో లింగ నిష్పత్తి ప్రతిరోజూ మారుతూ వస్తోంది. దాని ప్రభావం మధ్యప్రదేశ్ లోని శివపురి ప్రాంతంలో ఎక్కువగా చూడవచ్చు.

ఆ స్టాంపు పేపరు విలువ రూ.10 నుంచి రూ.100 వరకూ ఉంటాయి..

ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది.ఈ ఒప్పందాన్ని అధికారికం చేయటానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై సంతకం చేస్తారు. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం సమయం అయిపోయాక, ఆ తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది.

ఇలాంటి చర్యలు అనేకసార్లు ఇలాంటి చర్యలు అనేకసార్లు పోలీసుల ఎదుట కూడా జరిగాయి. కానీ స్త్రీలు తమంతట తాము నోరువిప్పనంతకాలం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోనంతకాలం ఎలా అలాంటి వాటిపై చర్యలు తీసుకోగలరు?
ఈ ప్రాంతంలో అనేకమంది మధ్యవర్తులు ఈ ప్రాంతంలో అనేకమంది మధ్యవర్తులు చిన్న గిరిజన యువతులను రూ 500 నుంచి రూ.60000 వరకూ వారి పేదరికం, డబ్బు అవసరాలను బట్టి ఇలా పంపిణీ చేయడానికి పనిచేస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బ్రోకర్ దాదాపు నెలకి 1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు.

ఏ దేశంలో అయితే మనం స్త్రీలను శక్తిరూపాలుగా, ఏ దేశంలో అయితే మనం స్త్రీలను శక్తిరూపాలుగా, సమానహక్కులకోసం పోరాడుతూ చూస్తున్నామో, అక్కడే ఒక స్త్రీని అద్దెకి అమ్మబడుతున్నది కూడా. ఈ సంస్కృతిని పెకలించి వేయటమే కాదు, స్త్రీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడటం నేర్చుకోవాలి.

“ఒక స్త్రీ సంపూర్ణ వృత్తం.ఆమెలోనే సృష్టించే శక్తి, పోషించే మరియు మార్చే శక్తులు కూడా ఉన్నాయి.” – డయాన్ మేరీఛైల్డ్.

More from my site

Leave a Reply

*