హాస్టల్ పోరిని పాడు చేయాలని చూశాడు.. సిసి కెమెరాలకు చిక్కాడు..(వీడియో)

క్రైమ్ విషయాలు చాలా వరకు సిసి కెమెరాల ధ్వారా బయటకు వస్తున్నాయి. గతంలో ఏవి అంతగా బయటకు వచ్చేవి కావు. ఇప్పుడంతా ఆన్ లైన్ మయం అయిపోయాక.. సిసి కెమేరా రికార్డ్ దృశ్యాలు అన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి. క్రైమ్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిపోతోంది. తాజాగా కేరళలోని తిరువనంత పురంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.ఇప్పుడీ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ అమ్మాయిపై ఒక గ్రామస్థుడు చేసిన అత్యాచారయత్నం దృశ్యాలు… సీసీటీవీలో నమోదయ్యాయి. జికోడ్‌లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం చాలా పెద్ద దుమారాన్నే రేపుతుంది.

ఈ నెల 18న వైఎంసీఏ రోడ్డులో అప్పుడే ఊరి నుంచి వచ్చిన యువతి తాను బస చేసిన హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది.సరిగ్గా అదే సమయంలో నిందితుడు ఆమె కంటే ముందుగానే ఆ మార్గంలో బయలు దేరాడు. వీధి చివర వరకు వెళ్లాక.. ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుని ఆమెను బలవంతంగా పొదల్లోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నించాడు. ఆమె గ‌ట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఆ వీధి సీసీ కెమెరాలో రికార్డ అయ్యాయి. దీని ఆధారంగా జంషేర్ అనే యువకుడిని గుర్తించిన న‌డ‌క్కవ్ పోలీసులు….కేవలం మూడు రోజుల్లోనే అతడిని పట్టేశారు.

More from my site

Leave a Reply

*