హరి తేజకు పెళ్లి కాకముందు ఉన్న ఎఫైర్ గురించి బయట పెట్టిన అలీకి.. పరువు తీసే సమాధానం ఇచ్చింది (వీడియో)

ఈ టివి లో ఆలీ యాంకర్ గా చేస్తున్న షో ఆలీ తో సరదాగా.. ఈ షోలో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తు షో ని టాప్ రెంజ్ లో నడిపిస్తున్నాడు.. అలాంటి షో కి బిగ్ బాస్ లో చేసిన హరి తేజ ఆదర్ష్ గెస్ట్ లుగా వచ్చారు.. ‘మనసు మమత’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుని, త్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమాతో వెండితెరపై కూడా మెప్పించింది నటి హరితేజ.షోలో తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాను పుట్టి, పెరిగింది తిరుపతి అని, హైదరాబాద్‌లో సెటిలయ్యామని హరితేజ చెప్పింది. ఓ కన్నడిగుడితో సినీఫక్కీలో జరిగిన తన పెళ్లి గురించి కూడా ముచ్చటించింది. అందులో అలీ అడిగిన ప్రశ్నకు హరితేజ ఒక్కసారిగా షాక్ అయ్యింది.. అసలు హరితేజ ఏం సమాధానం ఇచ్చిందో ఈ వీడియో లో చూడండి..

అయితే రెండేళ్ల ముందు బెంగళూరుకు చెందిన దీపక్ మ్యాచ్ వచ్చింది. ఇంట్లోవాళ్లకు ఏదో సెట్ అవ్వక క్యాన్సిల్ అయింది. ఆ రెండేళ్ల గ్యాప్‌లో ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయాం. రెండేళ్ల తర్వాత ఆ అబ్బాయి మళ్లీ నన్ను అప్రోచ్ అయ్యాడు. పాత గొడవలన్నీ మర్చిపోయుంటారు కదా.. ఇప్పడు చేసుకుందామన్నాడు.అప్పుడు వాళ్ల అమ్మ వచ్చి మా ఇంట్లో మాట్లడం అన్నీ జరిగిపోయాయి. నేను ఇక్కడ పనిచేయాలి.. నువ్వేమో బెంగళూరులో ఉంటావ్ ఎలా అని నేను అడిగితే.. ‘పెళ్లయిపోతే చాలే.. నువ్వు ఎక్కడైనా ఉండు.. నాకేం ప్రాబ్లెం లేదు’ అన్నాడు. నా వర్క్‌కు నువ్వు ఎటువంటి ఇబ్బందిపెట్టకపోతే ఓకే అని చెప్పి చేసుకున్నా. మా ఆయణ్ని చేసుకున్నాక చాలా బిజీ అయిపోయాను. సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. వీకెండ్స్ ఉన్నప్పుడు తనే ఇక్కడికి వచ్చి, వెళుతుంటాడు.’’ అని చెప్పింది.

రెండేళ్ల ముందు ఎందుకు బ్రేక్ అయింది? అని యాంకర్ ప్రశ్నించగా..‘‘ మా నాన్నకు, వాళ్ల నాన్నకు ఏదో చిన్న గొడవ ఏదో అయింది. మా నాన్నకు నా మీద ఓవర్ కేరింగ్ ఉండడం వల్ల పర్సనల్‌గా అన్నీ సెట్ అయ్యాక మా ఆయనకు ఫోన్ చేసి ‘నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక సారి తీసుకొచ్చి నాకు చూపించు.ఇది నీకు- నాకు మధ్య ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అనుకుని చూపించు బాబు’ అని అన్నాడు. అప్పుడు మా ఆయనకు కోపం వచ్చేసింది. అంటే నామీద నమ్మకం లేదా? మీరు అలా ఎలా అడిగారు? ఎందుకు అడిగారు? అని కోపంతో వాళ్ల నాన్నకు చెప్పి, వాళ్ల నాన్న మాకు ఫోన్ చేసి మీకు అంత నమ్మకం లేకుంటే మానేయండి అనే సరికి, మా నాన్న ఇలా అన్నారే అని నాతో అన్నారు.అయితే మానేయమను అని నేను కూడా మానేశా. అలా అది టపక్ అని బ్రేక్ అయింది. మా ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు. వామ్మో!.. ఇది బ్రేక్ అయిందేంటి? చిన్న గొడవ వచ్చి ఆగిపోతుందనుకుంటే సడెన్‌గా బ్రేక్ అయిందే అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. తన తప్పు తానే తెలుసుకుని సెట్ అయ్యేసరికి రెండేళ్లు పట్టింది. అయితే రెండేళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను కాబట్టి సరిపోయింది. హీ ఈజ్ లక్కీ.’’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

ఇంకా తన భర్త గురించి చెబుతూ.. దీపక్ చాలా ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, తాను బెంగళూరుకు వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి జిమ్‌లో కపుల్ వర్కవుట్స్ చేసుకుంటుంటామని హరితేజ చెప్పుకొచ్చింది. తన భర్తకు ఫిట్‌నెస్‌ అంటే ఎంతిష్టమో చెప్పడానికి ఓ ఆశ్చర్యకర సంఘటనను కూడా బయటపెట్టింది.‘‘పెళ్లయిన నాలుగైదు రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం మా ఆయనొస్తాడు.. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాడు అని నేను ఎదురు చూస్తుంటే.. రాగానే మంచి ట్రాక్ వేసుకుని, షూస్ వేసుకుని ‘నేను జిమ్‌కు వెళ్తున్నా వస్తావా?’ అనగానే..జిమ్మా?.. నాలుగు రోజులైందిరా పెళ్లయి అని తిట్టుకుని నేను రాను అని చెప్పి ఇంట్లోనే బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. వారమంతా మా అమ్మకు ఫోన్ చేసి బాగా ఏడ్చేదాన్ని.ఏంటమ్మా ఇంత ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. జిమ్ అని ఎప్పుడూ అక్కడే పడుంటాడు అని మా అమ్మకు కంప్లయింట్ చేసినా.. ‘సర్లెమ్మా.. పర్లేదు. అబ్బాయిలు మెల్లగా మారుతారు.’ అని నాకే క్లాస్ పీకేది. అల్లుడు తప్పని ఎప్పుడూ అనదు. అలా ఆయనేం మారలేదు. నేనే మెల్లమెల్లగా మారి జిమ్‌కు వెళ్లడం మొదలెట్టా.’’ అని తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది హరితేజ.

 

 

More from my site

Leave a Reply

*