బ్రేకింగ్ న్యూస్: మరో దిమ్మతిరిగే షాకిచ్చిన RBI.. పాత 100రూ. నోట్లు ఇక చెల్లవట.

భారత రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న వంద రూపాయి నోట్లను పూర్తిగా రద్దు చేయనుంది. దాని స్థానంలో కొత్త రూపాయి నోటను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది. ఈ పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పటికే దేశంలో ద్రవ్యకొరత కారణంగా ఆర్థిక మందగమనం ఏర్పడివుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.గత ఏడాది నవంబరు 8 నాటి పరిస్థితి రేంజ్ లో కాకపోయినా.. మరోసారి నోట్ల రద్దు విషయం తెరమీదకి వచ్చింది. తాజాగా ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.100 నోటును కూడా రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు డిసైడ్ అయింది. ఇప్పటికే దీనిపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయంలో తాజాగా రిజర్వ్ బ్యాంకు క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత వంద రూపాయల నోట్లను క్రమంగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంది.వీటి స్థానంలో కొత్త వంద రూపాయల నోట్లను ప్రవేశ పెట్టనున్నారట. అయితే వీటిని ఉపసంహరిస్తే.. చిల్లర కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్లు విలవిలలాడే ప్రమాదం ఉందని గుర్తించి.. ఒకే సారి కాకుండా క్రమ క్రమంగా వందనోట్లను ఉపసంహరించాలని నిర్ణయించారట రిజర్వ్ బ్యాంకు అధికారులు. ఇక కొత్త 200 రూపాయల నోట్లను ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసినా.. అవి చాలినంత మేరకు చలామణిలో లేవని.. కాబట్టి వీటి ముద్రణను మరింత పెంచి.. వచ్చే ఏడాది మార్చి కల్లా మార్కెట్లోకి పూర్తిగా ప్రవేశ పెట్టాలని ప్రాధమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు.వీటికి తోడు తాజాగా కొత్తగా 200 నోట్లు కూడా విడుదలైన విషయం తెల్సిందే. కొత్త నోట్ల డిజైన్‌ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం 2000, 500, 200 నోట్ల తరహాలోనే మిగిలిన అన్ని నోట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే 50 రూపాయల నోట్ల డిజైన్‌లను మార్చేసిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 100 రూపాయల నోట్లను మార్చేందుకు సిద్దం అయ్యింది.

కొత్త డిజైన్‌లను ఇప్పటికే సిద్దం చేసిన ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ముద్రణ ప్రారంభించేందుకు సిద్దం అవుతుంది.ఆ తర్వాత కొత్త వంద రూపాయల నోట్ల ముద్రణను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక అప్పటి నుంచి పాత వంద నోట్లను ఉపసంహరిస్తారట. అయితే నోటు సైజులో మార్పు లేకుండా పాత నోటు సైజులోనే కొత్తవాటిని ముద్రించాలని అధికారులు నిర్ణయించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వంద రూపాయల నోటు ముద్రణ జరుగుతుందని వెల్లడించింది. సో.. పాత వందకు ఇక కాలం చెల్లినట్టేనన్నమాట!!నోట్ల పరిమాణం తగ్గించడంతో పాటు, వ్యయం తగ్గించుకోవడం కోసం ఆర్బీఐ చేస్తున్న ఈ పని ఫలితాన్ని ఇస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సామాన్యులు ఈ నిర్ణయం వల్ల చాలా కంగారు పడుతున్నారు. మీడియాలో 100 నోట్ల రద్దు అంటూ వార్తలు వస్తుండటంతో వంద నోట్లు తీసుకునేందుకు భయపడుతున్నారు. కొందరు 200 రూపాయల నోట్లు కొత్తవి వచ్చినట్లుగా తెలియక పోవడంతో వారి వద్దకు వచ్చే 200 నోట్లను చిత్తు కాగితాలుగా భావిస్తున్నారు.ఇలా ఆర్బీఐ ప్రజలను గందరగోళంకు గురి చేస్తూంది. 100 నోట్ల రద్దు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు నోట్ల రద్దు కాదు, పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు రాబోతున్నాయి. వారి వద్ద ఉన్న 100 నోట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే విషయాలను మాత్రం మీడియా ప్రచారం చేయడం లేదు. ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.

More from my site

Leave a Reply

*