సింగర్ సునీత సంచలన నిర్ణయం..ఇది ఎవ్వరు ఊహించలేరు..

మధురమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడింది గాయిని సునీత. ఆకర్షణీయమైన రూపం కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చింది. అయితే గాయనిగా మాత్రం ప్రారంభంలో మంచి ఛాన్సులే దక్కించుకున్నా.. తర్వాత తర్వాత కొత్త తరం సింగర్లు దూసుకురావడంతో అవకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. అయితే సునీతను చూస్తే ఈమెకు టీనేజ్ లో ఉన్న పిల్లలు ఉన్నారంటే ఎవరూ నమ్మరు. అంతలా తన గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది సునీత. అయితే అప్పుడప్పుడు ఈమె గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే సునీత ఆన్ స్క్రీన్ ఎంట్రీ గురించి. చూడ్డానికి ఎంతో అందంగా ఉండే సునీతకు అవకాశాలు ఇవ్వడానికి చాలా మంది దర్శకులు ఎప్పటి నుంచో ప్రతిపాధనలు చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాల్లో నటించడానికి రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. సింగర్ గానే తన కెరీర్ ను బిల్డప్ చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు ఆమె. తాను.

సింగర్ గానే హ్యాపీగా ఉన్నానని ఇలానే కంటిన్యూ అవుతానని చెప్పడంతో ఆమెను ఈ విషయంలో ఎవరూ ఒప్పించలేక పోయారు. అయితే ఇప్పుడు సింగర్ గా అవకాశాలు తగ్గడంతో తాను నటిగా మారాల్సిన సమయం వచ్చిందని సునీత నిర్నాయించుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఆమె ఎటూ తేల్చుకోలేక పోతోందని సమాచారం. త్వరలో నాగచైతన్య హీరోగా చేసే సినిమాలో అతని తల్లి క్యారక్టర్ చేయమని దర్శకుడు అడిగారట. అయితే దానికి ఆమె కొంచెం ఆలోచించుకొని చెప్తానని చెప్పిందట. ఆ తరువాత చేయబోనని చెప్పేసిందట. నటిగా మారాలనే ఆలోచన ఉన్నా.. ఏ సినిమాతో ఎలా ఎంట్రీ ఇవ్వాలో? అనే డైలమా లో ఉందట. ఏది ఏమైనా సునీత నటిగా మారితే ప్రస్తుతం స్టార్ ఆంటీలు అందరికీ కష్టాలు తప్పవు. అయితే సింగర్ గా ఛాన్స్ లు పడిపోయిన క్రమంలో నటించే అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నారో చాలా మందికి ఊహకందని విషయంగా ఉంది. ఏది ఏమయినా సునీతను ఆన్ స్క్రీన్ పై చూడాలని కోరుకునే తెలుగు ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఆమె ఆ వైపుగా త్వరగా డెసిషన్ తీసుకోవాలని కోరుకుందాం..

More from my site

Leave a Reply

*