ఈమె 11 మంది భర్తలను పెళ్లి చేసుకొని వాళ్ళతో ఏం చేసిందో తెలిస్తే షాక్ (వీడియో)

అందమైన అమ్మాయి మనస్సు స్వచ్ఛమైంది అని అంటారు. అమ్మాయి ఆమె రూపం వెనుక కొందరికి అతి వికృతమైన మనస్సు ఉంది అంటుందని గ్రహించాలి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. అందంతో పాటు మనస్సును కూడా చూసి ప్రేమించాలని లేదంటే ఇబ్బందులు తప్పవు. థాయ్‌ల్యాండ్‌కు చెందిన 11 మంది ఆమె అందాన్ని మాత్రమే చూసి, ఆమె గతం ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని మోసపోయారు. ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుని చీటింగ్‌ చేసిన ఆ లేడీ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. థాయ్‌ల్యాండ్‌లో ఉన్న ఒక పెళ్లి ఆచారం ఈమె మోసాలకు దోహదం చేసింది. పెళ్లి సమయంలో వరుడు తన స్థాయికి తగ్గట్లుగా పెద్ద మొత్తంలో వదువుకు డబ్బులను ఇవ్వాలి.

అలా ఇచ్చిన డబ్బులు సహజంగా అయితే మళ్లీ కుటుంబ అవసరాల కోసం వారు వాడాలి. కాని ఈమె మాత్రం డబ్బులు తీసుకుని, వరుడిని వదిలి వెళ్లి పోయేది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈమె డబ్బున్న వ్యక్తిని ప్రేమలో దించి, అతడితో పెళ్లి వరకు వెళ్తుంది. పెళ్లి సమయంలో అతడిని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తుంది, ప్రేమించిన అమ్మాయి డిమాండ్‌ చేయడంతో పాటు, ఆచారం కూడా కనుక ఆ వరుడు పెద్ద మొత్తంలోనే డబ్బులు ఇస్తాడు.పెళ్లి అయిన మూడు నాలు రోజుల్లో లేదా పది రోజుల లోపు ఆ ఇంటి నుండి బయట పడుతుంది. తను కొన్ని కారణాల వల్ల నీతో సంసారం చేయలేను అంటూ చెబుతుంది.

జాతకాలు కలవలేదు, లేదా తనకు ఏదైనా వ్యాది ఉంది అంటూ చెప్పి అతడి నుండి దూరం అవుతుంది.ఆ తర్వాత కొన్ని నెలలకు మరో పెళ్లి చేసుకుంది. ఇలా ఆమె మొత్తం 11 మందిని వివాహం చేసుకున్నట్లుగా వెళ్లడైంది. ఆమె ఇప్పటి వరకు తన భర్తల నుండి 5.4 లక్షల డాలర్లను రాబట్టిందట. ప్రపంచంలో ఇలాంటి వింత మోసం ఎక్కడ జరగలేదని, ఇలాంటి మోసాలు  కూడా చేయవచ్చా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.ఒక మహిళ 11 మందిని వివాహం చేసుకుని, డబ్బులు వసూళ్లు చేసింది అంటూ ఒక థాయ్‌ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ కాస్త వైరల్‌ అయ్యింది. పోస్ట్‌లో ఆమె ఫొటోలు, సాక్ష్యాధారాలు అన్ని పెట్టాడు. దాంతో అమ్మగారి పెళ్లిళ్లకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

More from my site

Leave a Reply

*